మెహ్రీన్ కౌర్ సక్సెస్ వెనుక ఆ టాప్ హీరో..?

Google+ Pinterest LinkedIn Tumblr +

మెహ్రీన్ కౌర్ టాలీవుడ్ లో ఉన్న అతి కొద్దీ మంది స్టార్ హీరోయిన్స్ లో ఒకరు. అయితే మెహ్రీన్ కి ఇప్పటి వరకు స్టార్ డమ్ తీసుకు వచ్చే క్యారెక్టర్ ఒకటి కూడా రాలేదు. కేవలం తన గ్లామర్ తోనే ఇంత కాలం నెట్టుకు వస్తుంది. యాక్టింగ్ పరంగా కూడా మెహ్రీన్ ఏమంత గొప్పగా నటించిన సందర్భాలు లేవు. యూత్ లో కూడా తనకి ఏమంత ఫాలోయింగ్ లేదు, అయిన కూడా తనకి వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయ్.
ఇదే ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మెహ్రీన్ కి మధ్య స్థాయి నుండి స్టార్ హీరోల సరసన బారి ఆఫర్స్ వెతుక్కుంటూ వస్తున్నాయి.
తాజాగా స్టార్ హీరోలు నాని, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సందీప్ కిషన్, శర్వానంద్ సరసన వరుస అవకాశాలు దక్కించుకుంది ఈ బొద్దు గుమ్మా. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదుగుతున్న విజయ్ దేవరకొండ సరసన ‘ నోటా ‘ సినిమాలో నటిస్తుంది. వరుణ్ తేజ్, వెంకటేష్ మల్టీస్టారర్ ‘ ఎఫ్ 2 ‘ లో కూడా నటిస్తుంది.

మెహ్రీన్ కౌర్ నటించిన గత మూడు సినిమాలు జవాన్, పంతం, కేర్ అఫ్ సూర్య బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. అయిన కూడా తనకి అవకాశాలు వస్తూనే ఉన్నాయ్. ఇదే టాలీవుడ్ వర్గాలని ఆశ్చర్యానికి గురి చేసింది. తన సక్సెస్ వెనుక ఇండస్ట్రీ కి చెందిన ఒక స్టార్ హీరో ఉన్నాడని తెలుగు చిత్ర సీమలో ఒక వార్త చెక్కర్లు కొడుతుంది. ఆ స్టార్ హీరో కి ఇండస్ట్రీ లో చాల మంది బడా నిర్మాతలతో పరిచయం కూడా ఉండటంతో మెహ్రీన్ కి అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి అని టాక్.

Share.