నటి కంగనా రనౌత్ నిత్యం ఏదో ఒక వివాదం లో చిక్కుకునే ఉంటుంది. సినిమాల్లో తన నటన కంటే కూడా జనం ఆమె వివాదాల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటారు. ఇక ఇప్పుడు తాజాగా ఆమె మరో వివాదం లో చిక్కుకుంది. కంగనా గత సంవత్సరం ముంబై లోని పాలి హిల్ ఏరియాలో అత్యంత విలువ చేసే ఖరీదైన ఫ్లాట్ ఒకటి తీసుకున్నారు. అయితే ఇది ఆమెకి ఒక బ్రోకర్ ద్వారా లభించిందని సమాచారం. ముందు అనుకున్న ప్రకారం బ్రోకర్ కి ఇంటి విలువలో ఒక శాతం కమిషన్ వచ్చే విధంగా అగ్రిమెంట్ చేసుకున్నారట ఇద్దరు.
అనుకున్న విధంగానే ఇంటిని కొనుగోలు చేసిన తర్వాత కంగనా సదరు బ్రోకర్ కి ఒక శాతం కమిషన్ కింద అతడికి రూ 22 లక్షలు ఇచ్చానని, అయితే ఇప్పుడు అలా కాకుండా తనకి రెండు శాతం కమిషన్ కావాలని బ్రోకర్ వేధిస్తున్నాడంటూ కంగనా పోలీసులకి తెలిపింది. సదరు బ్రోకర్ తనకి అదనంగా ఇంకో 22 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నాడని ఆరోపించారు.
తమ ఇరువురి అగ్రిమెంట్ లో ఎక్కడ 2 పర్సెంట్ బ్రోకరేజీ పై నేను హామీ ఇవ్వలేదని కంగనా మీడియా ఎదుట వెల్లడించింది. తమ ఇద్దరి మధ్య జరిగిన అగ్రిమెంట్ డాక్యుమెంట్స్ తన వద్ద ఉన్నాయని పోలీసులు కోరితే వాటిని తక్షణం వారికి చూపిస్తానని తెలిపారు నటి కంగనా రనౌత్.