మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం మాస్ చిత్రాల డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ ఒక కొత్త లుక్‌లో కనిపిస్తాడు. కాగా ఈ సినిమాతో చరణ్ మరోసారి బాక్సాఫీస్ భరతం పట్టడం ఖాయం అని అంటున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఇప్పుడు ఫిలింనగర్‌లో తెగ చక్కర్లు కొడుతోంది.
త్వరలో చరణ్ మరోసారి పోలీస్ అవతారంలో కనిపిస్తాడనే వార్త ఇప్పటికే అందరికీ తెలిసింది. కాగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే బిగ్గెస్ట్ మల్టీస్టారర్ #RRR లో చరణ్ ఇలా పోలీస్‌గా మారుతాడని అందరు అనుకున్నారు . అయితే చరణ్ పోలీస్ అవతారం రాజమౌళి కోసం కాదట. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వస్తున్న సినిమాలోనే చరణ్ ఈ పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది.
గతంలోనూ చరణ్ ‘తూఫాన్’ చిత్రంలో పోలీస్ అవతారంలో కనిపిస్తే జనాలు ఆ సినిమాను పట్టించుకోలేదు. మరి ఇప్పుడు చరణ్‌ను పోలీసుగా జనాలు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది చూడాలి. ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. డివివి దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు చిత్ర యూనిట్.