మెగా హీరో సాయి ధరమ్ తేజ్ వరుస ఫెయిల్యూర్స్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఇప్పటికే వరుసగా 6 చిత్రాలు డిజాస్టర్లుగా మారగా ఇప్పుడు తన నెక్ట్స్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు ఈ హీరో. కాగా ఈ సినిమా కోసం కాస్త టైమ్ తీసుకుని వస్తానంటున్న ఈ హీరో భారీగా మేకోవర్ చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘‘చిత్రలహరి’’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టారు చిత్ర యూనిట్. ఇప్పుడు ఈ టైటిల్ వెనుక అసలు కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాలో తేజు సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. అందులో ఒకరి పేరు ‘చిత్ర’ మరొకరి పేరు ‘లహరి’. ముక్కోణపు ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపడేయం గ్యారెంటీ అంటున్నారు చిత్ర యూనిట్. ఒక హీరోయిన్‌గా మలయాళీ గుమ్మ నివేథా థామస్ సెలెక్ట్ కాగా మరో హీరోయిన్ కోసం చిత్ర యూనిట్ గాలిస్తున్నారు. అతి తొందరలో ఈ చిత్ర షూటింగ్ మొదలుపెట్టేందుకు రెడీ అవుతున్నారు తేజు అండ్ టీమ్.
‘నేను శైలజా’ డైరెక్టర్ కిషోర్ తిరుమల ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండటంతో అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.