గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్లో పోకిరి సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్గా మారి కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీని ఏలింది. ఆ తరువాత తమిళం అక్కడనుండి హిందీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. దీంతో తెలుగులో అమ్మడు సినిమాలు చేయడం తగ్గించేసింది. అయితే తెలుగు ప్రేక్షకులకు మాత్రం తన అందాలు పంచడంలో ఎప్పుడు ముందు నిలిచింది ఇలియానా.
ఇటీవల కాలంలో ఇలియానా తన బాయ్‌ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్‌తో కలిసి ఫిజీ దీవుల్లో చెలరేగిపోయి చెట్టాపట్టాలేసుకున్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోల్లో ఇలియానా ఎంత హాట్ హాట్‌గా కనిపించి వేడిపుట్టించిందో అందరికీ తెలిసిందే. ఫిజీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఇల్లీ బేబి సెలెక్ట్ కావడంతో ఆ పినిమీదే తాను హాట్ ఫోటో షూట్ చేసి ఫిజీ అందాలను ప్రమోట్ చేసింది. ఇప్పుడు ఈ ఫోటోలకు సంబంధించిన యాడ్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ఇల్లీ పాప అందాలకు మించి ఫిజీ అందాలు వీక్షకులను కట్టిపడేస్తున్నాయి.
ఔరా భూమిపై ఇలాంటి అందమైన ప్రదేశం ఉందా అనే విధంగా ఈ వీడియో ఉండటంతో జనాలు ఈ వీడియోను ఎగబడి చూస్తున్నారు. మొత్తానికి తాను ప్రమోట్ చేసిన వీడియోతో పాటు తన అందాలకు సైతం మంచి క్రేజ్ సాధించడం ఒక్క ఇలియానాకే సొంతం అని చెప్పాలి. ఇక తన బాయ్‌ఫ్రెండ్‌ను అతి త్వరలో వివాహం చేసుకోబోతున్న ఇలియానా ప్రస్తుతం రవితేజతో కలిసి అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో నటిస్తోంది.