విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గీత గోవిందం’ రష్మిక మందనా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. బన్నీ వాస్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించగా పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. కొద్దీ రోజుల క్రితం జరిగిన ఆడియో రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ ‘గీత గోవిందం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మరో సర్ ప్రైజ్ ప్లాన్ చేశారట నిర్మాత అల్లు అరవింద్.
అదే ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకు వచ్చే ఆలోచనలో ఉన్నారట అల్లు అరవింద్. మరి తన బావ మాటని అంగీకరించి మెగాస్టార్ ఈ ఈవెంట్ కి వస్తారో లేదో అనేది తెలియాలంటే ఈ నెల 12 వ తేదీ వరకు ఆగాల్సిందే. గీత ఆర్ట్స్ నుండి ఈ వార్త పై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. ‘గీత గోవిందం’ సినిమా ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ నెల 15 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.