సినీ ఇండస్ట్రీ లో మన సౌత్ హీరోయిన్స్ బోల్డ్ టాపిక్స్ పై మాట్లాడటానికి కొంచం సంకోచిస్తారు అదే బాలీవుడ్ కథానాయికలు మాత్రం అందరి ముందే ఏ మాత్రం ఆలోచించకుండా అన్ని విషయాలు ప్రస్తావిస్తారు. ఇక ఇప్పుడు మనకి కూడా ఆలా బోల్డ్ గా మాట్లాడే ఒక హీరోయిన్ వచ్చేసింది ఆమె మరెవరో కాదు మన తెలుగు అమ్మాయి మిస్ ఇండియా విన్నర్ శోభిత ధూళిపాళ్ల. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో విలేకరి ఆమెని కొన్ని ఘాటైన ప్రశ్నలు అడగ్గా ఆమె కూడా అంతే ఘాటుగా సమాధానం చెప్పారు.
విలేకరి మీరు 20 సంవత్సరాలకే మిస్ ఇండియా పోటీల్లో ఎందుకు పాల్గొన్నారు అని ప్రశ్నించగా, దానికి శోభిత సమాధానం చెబుతూ మా కాలేజీ లో ఉండే అందమైన అబ్బాయిలను ఆకర్షించటకే అని చెప్పింది, అంతే కాకుండా టీనేజ్ లో శరీరంలో వచ్చే మార్పులు తనను ఏదో చెయ్యమని చెప్పేవని అందువలనే మోడలింగ్ వృత్తి లోకి అడుగు పెట్టానని చెప్పారు శోభిత. ఆమె సమాధానాలు విన్న మీడియా వారు ఆశ్చర్య పోయారట.
ప్రస్తుతం శోభిత తెలుగులో అడివి శేష్ సరసన ‘గూఢచారి’ సినిమాలో నటిస్తుంది.