దిశ అత్యాచారం హత్య ఘటన తర్వాత టాలివుడ్ లో ఏ విధంగా స్పందిస్తున్నారో అందరికి తెలిసిందే. హీరోలు, హీరోయిన్లు, యాంకర్లు, చిన్న చిన్న నటులు అందరూ కూడా ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆవేదనగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ సమాజ౦ లో మార్పు కోసం అందరిలో మార్పు రావాలని సలహాలు ఇస్తూ నిందితుల విషయంలో కఠినంగా మాట్లాడుతూ… సామాజిక స్పృహను బయటపెడుతున్నారు. వారిని కాల్చి చంపిన తర్వాత అయితే… పోలీసులు రియల్ హీరోలు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు,
అలాంటి వారిపై కఠినం గా, జాలి లేకుండా వ్యవహరించడంలో తప్పు లేదని అంటున్నారు. యాంకర్లు రష్మీ, అనసూయ ఘాటుగా స్పందిస్తూ బాధితురాలికి, సమాజంలో ఉన్న ఆడపిల్లలకు అండగా నిలబడుతున్నారు. ఇదిలా ఉంటే… ఇప్పుడు అనసూయపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇటీవల ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో అనసూయ కాస్త అసభ్యంగా కనపడింది… ఇద్దరు పిల్లలు ఉండి కూడా… సినిమా అవకాశాల కోసం మీరు సోషల్ మీడియాలో పెడుతున్న,
ఫోటోలు, వీడియోలు ఏంటీ అనసూయ అంటీ…? మీ భర్త తలకు మసాజ్ చేస్తూ మీరు తొడలు కనపడుతూ పెట్టిన ఫోటో గురించి ఏం చెప్తారు అండి…? మీరు అవకాశాల కోసం ప్రయత్నాలు చేయడంలో తప్పు లేదు. కాని మీరు ఇద్దరు పిల్లలకు తల్లి అనే విషయాన్ని మర్చిపోయి కొన్ని కొన్ని టీవీ షోస్ లో యాంకర్ గా మీ మాటలు అన్ని వినోదాన్ని పంచుతున్నాయి అని మీరు అనుకుంటున్నారు. అవకాశాల కోసం మీరు అలా చేయడంలో తప్పు లేదు, కాని దయచేసి నీతులు చెప్పడం, అత్యాచారాల గురించి ఆవేశంగా ప్రసంగాలు చేయడం చేయవద్దని కోరుతున్నాం అంటీ… అంటూ సోషల్ మీడియాలో అభిమానులు ఫైర్ అవుతున్నారు.