మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిన్న ఎల్ బి నగర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్ కి అభిమానులు తండోపతండాలుగా వచ్చారు. ‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అతిరథ మహారథులు ముఖ్య అథిదులుగా విచ్చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తో పాటు స్టార్ డైరెక్టర్స్ రాజమౌళి,వివివినాయక్ లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ రాజమౌళిని పొగడ్తలతో ముంచేశారు. గతంలో తన తనయుడు రాంచరణ్ కి ‘మగధీర’లాంటి ఎవర్ గ్రీన్ మూవీ అందించారని అన్నారు. ఇదే సందర్భంగా ‘బాహుబలి’ మూవీపై కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. పదిహేనేళ్ల క్రితం ‘సైరా’ సినిమా కథ, తన వద్దకు పరుచూరి బ్రదర్స్ తీసుకు వచ్చారని..తనపై రూ. 40 కోట్లు ఖర్చుతో సినిమాలు తీస్తున్న రోజుల్లోనే, ‘సైరా’ మూవీకికి రూ. 70 కోట్లపైనే ఖర్చు అవుతుందని చెప్పడంతో..ఆ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి.
దాంతో నిర్మాతలకు ఎలాంటి నష్టం జరిగినా ఇబ్బంది అవుతుందని ఎలాంటి నిర్ణయం తీసుకోలే పోయానని అన్నారు. మొత్తానికి రాంచరణ్ వల్ల తన కల సాకారమైందని అన్నారు. మొత్తానికి అన్నీ అనుకూలించి నా 151 వ సినిమా ‘సైరా’ కావడం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
అయితే ఈ మూవీ తెరపైకి రావడానికి ‘బాహుబలి’ కారణం అని..అప్పటి వరకు 100 కోట్ల బడ్జెట్ టాలీవుడ్ సినిమాలు తీయవచ్చా అన్న అనుమాలకు రాజమౌళి పులిస్టాప్ పెట్టారు. అంత గొప్ప సినిమా తీసి నిర్మాతలకు నష్టం రాకుండా సంపాదించుకోవచ్చని రాజమౌళి చేసి చూపించారు.