ఇండియన్‌–2 లో రకూల్ ప్రీత్ సింగ్ ?

Google+ Pinterest LinkedIn Tumblr +

సాధారణంగా సినీ రంగంలో ఎప్పుటికప్పుడు కొత్త కొత్త హీరోయిన్లు వెండితెరపై అలరిస్తుంటారు. హీరోయిన్ గా ఎంత మంచి హిట్స్ సాధించినా రెండు మూడు ఫ్లాపులు వస్తే ఆ హీరోయిన్ ని పక్కనబెడుతుంటారు దర్శక, నిర్మాతలు. జం చెప్పాలంటే ఇటీవల నటి నయనతార, తమన్నా, కాజల్‌అగర్వాల్‌ వంటి స్టార్‌ హీరోయిన్లు సరైన హిట్స్‌ చూసి చాలా కాలమైంది. కాకపోతే ఇందులో నయనతార కాస్త బిజీగా ఉందని చెప్పొచ్చు.

ఇక నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కొంత కాలంగా తెలుగు సరైన అవకాశం లేక ఇబ్బంది పడుతుంది. తెలుగు, తమిళ భాషల్లో హిట్‌ చూసి చాలా కాలమైంది. ముఖ్యంగా కోలీవుడ్‌లో దేవ్, ఎన్‌జీకే చిత్రాలు తన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశాయి. ప్రస్తుతం నాగార్జునకు జంటగా మన్మథుడు–2 మూవీలో నటించింది. తాజాగా మరో భారీ అవకాశం రకుల్‌ ఇంటి తలుపులు తట్టినట్టు సమాచారం.

అదే ఇండియన్‌–2 మూవీలో నటించే అవకాశం వచ్చిందని కోలీవుడ్ టాక్. స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ విశ్వనటుడు కమలహాసన్‌ హీరోగా ఇండియన్‌–2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా ఛాన్సు దక్కించుకున్న విషయం తెలిసిందే. కాగా సుధీర్ఘ చర్చలనంతరం ఇండియన్‌–2ను శంకర్‌ పట్టాలెక్కించనున్నారు. ఆగస్ట్‌లోనే చిత్ర షూటింగ్‌ మళ్లీ మొదలవనుందని సమాచారం. మరి ఇదే నిజమైతే రకూల్ పంట పండినట్లే అంటున్నారు కోటీవుడ్ వర్గాలు.

Share.