టాలీవుడ్ నుంచి బాలీవుడ్ బాట పడుతుంటారు నటీనటులు. టాలీవుడ్లో స్టార్‌గా పేరు తెచ్చుకుని, నాలుగు రాళ్ళు సంపాదించుకున్న తరువాత బాలీవుడ్ వైపు కన్నేస్తారు.. అక్కడ ఒక్క సినిమా హిట్ అయితే చాలు ఇక అక్కడే పాగావేస్తారు టాలీవుడ్ బామలు. పాగా వేయడమే కాదు.. బాలీవుడ్ హీరోలను వెంటతిప్పుకుంటారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ బామల చుట్టు బాలీవుడ్ బాబులు తిరుగుతున్నారు. రోజులు మారాయి కదా…! మేము ఎందుకు మారకూడదు.. అందుకే టాలీవుడ్ బామలతో డేటింగ్లు చేస్తున్నామని అంటున్నారు బాలీవుడ్ బాబులు…
ఇప్పుడు టాలీవుడ్ బేబితో ఓ బాలీవుడ్ బాబు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడట. అంతేనా ఏకంగా డేటింగ్ పేరుతో మస్తు మజా చేస్తున్నారట. సాయంత్రాలు అయ్యాయంటే చాలట. ఈ టాలీవుడ్, బాలీవుడ్ ఏకమైపోతున్నారట… ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇంతకు టాలీవుడ్ పాప, బాలీవుడ్ బాబు ఎవరనే కధా అనుమానం. అదేనండి విజయ్ దేవరకొండ తో హీరో అనే సినిమాలో నటిస్తున్న సుందరి మాళవిక మోహనన్. ఇక బాలీవుడ్ బాబు ఎవరంటే విక్కీ కౌశల్.
ఇప్పుడు ఈ ఇద్దరి జంట చూడముచ్చటగా ఉందట. యూరి సినిమాతో పాపులర్ అయిన విక్కీ కౌశల్‌తో మాళవిక మోహనన్ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందట. గత ఏడునెలలుగా వీరిజంట విచ్చలవిడిగా ప్రేమించేసుకుంటున్నారని మరో భామ రాధికా ఆప్టే వీరి ప్రేమను బజారుకెక్కిచ్చింది. ఇంతకు రాధిక ఆప్టేకు ఈ విషయం ఎలా తెలిసిందంటే… ఆప్టే తమ్ముడు కూడా మాళవికతో బాగా దగ్గరి స్నేహితుడట… సో అలా మాళవిక రహాస్యాలు లీకవుతున్నాయట. ఏదేమైనా టాలీవుడ్ బేబీ, బాలీవుడ్ బాబుల ప్రేమాయణం సాఫిగా సాగుద్దో లేదో వేచిచూడాల్సిందే.