సందీప్ రెడ్డి వంగా అంటే ఎవ్వరికి అంతగా తెలియని పేరు.. కాని అర్జున్రెడ్డి దర్శకుడు సందీప్రెడ్డి వంగా అంటే… ఓ అతడా అంటారు.. అంతే కాదు… కబీర్సింగ్ దర్శకుడు సందీప్రెడ్డి వంగా అంటే ఠక్కున గుర్తుకు వస్తుంది. ఇప్పుడు ఈ సందీప్రెడ్డి ఉరఫ్ అర్జున్రెడ్డికి ఓ బంఫరాఫర్ తగిలింది. అట్లాంటి ఇట్లాంటి ఆఫర్ కాదు… బాలీవుడ్లో కండలవీరుడితో సినిమా చేసే ఛాన్స్ వచ్చిందట.
టాలీవుడ్లో సంచలన దర్శకుడిగా ఓవర్నైట్లోనే పేరు సంపాదించుకున్నాడు సందీప్రెడ్డి వంగా. విజయ్ దేవరకొండ నటించిన అర్జున్రెడ్డి సినిమాకు దర్శకత్వం వహించిన సందీప్రెడ్డి వంగా ఓ సన్సేషన్నే క్రియోట్ చేశాడు. అనామకుడిగా సాగిపోతున్న విజయ్ దేవరకొండ జీవితానికి అర్జున్రెడ్డితో అందలమెక్కిస్తే… తానుకూడా అర్జున్రెడ్డి సినిమాతో తిరుగులేని విజయాన్ని అందుకుని బాలీవుడ్ బాట పట్టాడు.
అర్జున్రెడ్డిని కబీర్సింగ్గా బాలీవుడ్ చిత్రం తీసి బాలీవుడ్లోనే మరో సంచలనానికి నాంది పలికాడు. ఇప్పుడు అనామక సినిమాగా వచ్చిన కబీర్సింగ్ ఇప్పటికే 150కోట్ల క్లబ్లో చేరిపోగా, 200కోట్ల వసూలు వైపు శరవేగంగా దూసుకుపోతోంది. ఇప్పుడు బాలీవుడ్లో ఈ ఏడాది టాప్3 వసూలు చేసిన చిత్రంగా రికార్డు దిశగా పరుగులు తీస్తుంది. అయితే ఇప్పుడు సందీప్రెడ్డికి బాలీవుడ్లో కండలవీరుడిగా పేరున్న సల్మాన్ ఖాన్ నుంచి పిలుపొచ్చిందట. సల్మాన్ ఖాన్ సినిమా చేసేందుకు భారీ ఆఫర్ వచ్చిందట. ఇంతకు ఈ సినిమా నిర్మించే సంస్థ కూడా భారీ సంస్థే. అదే టీ సిరిస్ సంస్థ. సో సందీప్రెడ్డికి ఈ భారీ ఆఫర్తో బాలీవుడ్లోనే బంకలా అతుక్కుపోతాడేమోననే అనుమానం బలపడుతుంది.