మెగా హీరోకి షాక్ ఇచ్చిన రెజినా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగా హీరో సాయి ధరం తేజ్, రెజినాల జంట సూపర్ హిట్. పిల్లా నువ్వు లేని జీవితం సినిమాలో కలిసి నటించిన ఈ ఇద్దరు ఆ తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలో కూడా జత కట్టారు. ఇద్దరు కలిసి చేసిన రెండు సినిమాలు హిట్ అవడంతో ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది. అంతేకాదు ఇద్దరు లవర్స్ అన్న వార్తలు వచ్చాయి. అయితే కెరియర్ పరంగా సాయి తేజ్, రెజినా ఇద్దరు వెనుకపడిపోయారు. స్టార్ హీరోయిన్ అయ్యే క్వాలిటీస్ ఉన్నా రెజినా పూర్తిగా వెనుకపడ్డది.

ఇక ప్రేమా దోమా అంటూ మెగా హీరో కూడా కెరియర్ మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. అందుకే మనోడు కూడా రేసులో వెనుకపడ్డాడు. ఫైనల్ గా ఈమధ్యనే చిత్రలహరి సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాడు. ప్రస్తుతం సాయి ధరం తేజ్ మారుతి డైరక్షన్ లో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు ప్రతిరోజు పండుగే అనే టైటిల్ పెట్టబోతున్నారట. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇదిలాఉంటే ఎలాగు ఛాన్సులు రావట్లేదని రెజినా ఎంగేజ్మెంట్ చేసుకుందని అంటున్నారు.

జూన్ 13న రెజినా ఎంగేజ్మెంట్ జరిగిందట. ఓ బిజినెస్ మెన్ తో కొన్నాళ్లుగా పరిచయంలో ఉన్న రెజినా ఫైనల్ గా అతన్ని పెళ్లాడబోతుందని తెలుస్తుంది. ఆల్రెడీ గుట్టుచప్పుడు కాకుండా ఎంగేజ్మెంట్ చేసుకున్నారట. రెజినా ఎంగేజ్మెంట్ కు సినిమా వాళ్లు ఎవరు అటెండ్ అవలేదట. మరి ఇదంతా వాస్తవమా కాదా అన్నది అఫిషియల్ గా తెలియాల్సి ఉంది. హీరోయిన్ గా ఎలాగు అవకాశాలు రాకపోయే సరికి రెజినా ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజం అన్నది త్వరలో తెలుస్తుంది.

Share.