శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హ్యాపీడేస్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన తమన్నా తర్వాత మిల్కీబ్యూటీగా పేరు తెచ్చుకొని కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా పేరు మాత్రం రాలేదు. రాజమౌళి తీసిన బాహుబలి సినిమాలో అవంతిక పాత్రలో అప్సరసలా కనిపించినా తమన్నాకు మాత్రం పెద్దగా వర్క్ ఔట్ కాలేదు.
అప్పుడప్పుడు ఐటమ్ సాంగ్స్ లో మురిపిస్తున్న తమన్నా ఆ మద్య బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ప్రభుదేవతో కలిసిన నటించిన చిత్రం అభినేత్రి తెలుగు లో కాస్త పరవాలేదు అనిపించింది. ఈ మద్య అభినేత్రి 2 సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం ముచ్చటగా మూడోసారి అదే హీరోతో చేసిన హిందీ చిత్రం `ఖామోషి` త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తన మనసులో మాట చెప్పింది. చిత్ర పరిశ్రమలో తనకు స్వర్గీయ శ్రీదేవి అంటే ఎంతో ఇష్టమని..ఆమె నటన నాకు ఎంతో ఇన్స్ ప్రిరేష్ అని అన్నారు. అంతే కాదు ఆమె బయోపిక్ లో నేను నటిస్తే బాగుండు అనిపిస్తుందని అన్నారు. దేవి తరహాలోనే తమన్నాకు కూడా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మంచి గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. మరి, ఆ అవకాశం తమన్నాను వస్తుందా వేచి చూడాలి.