బాలయ్య సినిమాలో టాప్ హీరోయిన్స్

Google+ Pinterest LinkedIn Tumblr +

నందమూరి బాలకృష్ణ తన వందవ సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా తర్వాత దూకుడు పెంచారు. వారుసగా సినిమాలు తీస్తూ కుర్ర హీరోలకు సవాల్ విసురుతున్నారు. సంవత్సరానికి రెండు సినిమాల్లో నటించిన బాలయ్య ఈ మద్య రాజకీయాల్లో బిజీగా మారిపోయారు. ఇటీవల ఏపిలో జరిగిన ఎన్నికల్లో హిందూపూర్ నుంచి ఆయన రెండో సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఇప్పుడు ఆయన రాజకీయల్లో చురుకుగా పాల్గొంటూనే..సినిమాలపై దృష్టి సారిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత బోయపాటితో ఆయన సినిమా చేస్తారని, కె.ఎస్. రవి, వివివినాయక్ తో తీస్తారని రక రకాల వార్తలు వచ్చాయి. కానీ అప్పట్లో దేనిపై కూడా క్లారిటీ రాలేదు.

నిన్న బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా నిర్మాత సి కళ్యాణ్ , దర్శకుడు కెఎస్ రవికుమార్ వెళ్లడం తో అభిమానులక పూర్తిగా క్లారిటీ వచ్చేసింది. ఈ మూవీ లాంచింగ్ మరో రెండు రోజుల్లో అంటే 13న జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది . జగపతిబాబు విలన్ గా, హీరొయిన్స్ గా మేహ్రీన్ పాయల్ రాజ్ పుత్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సంక్రాంతి రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.

Share.