యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ డైరక్షన్ లో వస్తున్న సినిమా సాహో. యువి క్రియేషన్స్ వారు 300 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. మేకింగ్ వీడియోలతో సర్ ప్రైజ్ చేసిన సాహో సినిమా నుండి రీసెంట్ గా వచ్చిన పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఆగష్టు 15న రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా నుండి ఓ స్పెషల్ న్యూస్ బయటకు వచ్చింది.
సినిమాలో ప్రభాస్ తో పాటుగా సల్మాన్ ఖాన్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడని తెలుస్తుంది. ఏంటి ఇది నిజమా అని ఆశ్చర్యపోవచ్చు. సాహోలో సల్మాన్ ఖాన్ ఓ చిన్న కెమియో రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే దర్శక నిర్మాతలు సల్మాన్ ఖాన్ ను కలిసి మాట్లాడారట. ఆయన తన నిర్ణయం చెప్పాల్సి ఉందట. తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో సల్మాన్ కూడా ఉన్నది నిజమే అయితే కచ్చితంగా సాహోకి స్పెషల్ క్రేజ్ వచ్చినట్టే.
యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న సాహో సినిమాలోని యాక్షన్ ఘట్టాలు హాలీవుడ్ సినిమా ఫీల్ కలిగిస్తాయని తెలుస్తుంది. తెలుగు ప్రేక్షకులే కాదు ఇండియన్ ఆడియెన్స్ కు ఓ కొత్త అనుభూతి ఇచ్చేలా సాహో సినిమా ఉంటుందట. సినిమాలో ప్రభాస్ సర్ ప్రైజ్ చేయడం ఖాయమని అంటున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న ఈ సినిమా కూడా సంచలనాలు సృష్టించడం ఖాయమని అంటున్నారు.