ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మల్టీస్టారర్ సినిమా ‘ఎఫ్ 2’(ఫన్ అండ్ ఫ్రస్టేషన్)సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో వెంకటేష్ సరసన తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ నటించారు. ఎలాంటి అంచనాలు లేకుండా సింపుల్ గా థియేర్లో రిలీజ్ అయిన ‘ఎఫ్ 2’రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండి వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా ఫుల్ లెన్త్ కామెడీతో ఉండటంతో మాస్ ఆడియాన్స్ బాగా కనెక్ట్ అయ్యారు.
బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో దీనికి సీక్వెల్‌ను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ చిత్రం సీక్వెల్ రాబోతుందని వార్తలు వచ్చాయి. ఇందులో వెంకటేష్, వరుణ్ తేజ్ తో పాటు మాస్ మహరాజ రవితేజ నటించబోతున్నాడని..అందులోనూ ఫుల్ లెన్త్ అంధుడి క్యారెక్టర్ లో నటిస్తున్నాడని తెగ వార్తలు వచ్చాయి.
కానీ ఇప్పుడు ఈ మూవీ నుంచి కొత్త వార్త వినిపిస్తుంది. తాజాగా అనిల్ రావిపూడి ఈ సినిమా కోసం యంగ్ హీరో నితిన్‌ను సంప్రదించారని తెలుస్తోంది. నితిన్ పర్ఫెక్ట్గా తెలంగాణ యాస మాట్లాడగలుగుతాడు. నితిన్‌ని అనిల్ సంప్రదించడానికి ఇది కూడా ఒక కారణమట. మరి ఈ వార్తపై క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.