మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి వెంకటేష్ ఎందుకు ఆపేస్తాడని టైటిల్ చూసి ఆశ్చర్యపోవచ్చు. కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న తమన్నాకు ఎఫ్-2 సక్సెస్ కెరియర్ లో మంచి జోష్ ఇచ్చింది. ఎఫ్-2లో తమన్నా చేసింది ఏమి లేకున్నా వెంకటేష్ పుణ్యమాని ఆమెకు ఓ హిట్ వచ్చింది. అయితే హిట్ కోసం తపిస్తున్న తమన్నాకు అది దొరికే సరికి మళ్లీ ఆఫర్లు వస్తున్నాయి. ఈ సినిమా కూడా పోతే ఇక సినిమాలను ఆపేసి పెళ్లాడేద్దాం అనుకున్న తమన్నాకి వెంకీ మళ్లీ మంచి బ్రేక్ ఇచ్చాడని చెప్పొచ్చు.
కెరియర్ అటకెక్కిన ప్రతి హీరోయిన్ పెళ్లికి సిద్ధమవుతుంది. తమన్నా కూడా పెళ్లిపై ఇప్పుడప్పుడే ఆలోచన లేదని చెప్పినా సరే ఛాన్సులు లేకుంటే చివరకు పెళ్లికే ఫిక్స్ అయ్యేది. కాని తమన్నా మాత్రం సరైన టైంలో సరైన హిట్ కొట్టింది. ఈ దెబ్బతో మళ్లీ అమ్మడికి అవకాశాలు వచ్చేస్తాయి. ఇప్పటికే చిరంజీవి, కొరటాల శివ సినిమాలో నయనతార ఒక హీరోయిన్ కాగా మరో హీరోయిన్ గా తమన్నా నటిస్తుందని తెలుస్తుంది. ఇక తమిళంలో కూడా మరో రెండు ఆఫర్స్ వచ్చాయట. మొత్తానికి తమన్నా మళ్లీ ఫాంలోకి వచ్చింది. మరో రెండు హిట్లు పడితే మరో ఐదేళ్ల దాకా కెరియర్ కు ఢోకా ఉండదు.