స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య తర్వాత వస్తున్న సినిమాపై న్యూ ఇయర్ న ఓ క్లారిటీ వచ్చింది. కొన్నాళ్లుగా వార్తల్లో ఉన్నట్టుగానే మాటల మాంత్రికుడు త్రివిక్రం డైరక్షన్ లోనే బన్ని సినిమా కన్ఫాం చేశాడు. ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తో పాటుగా గీతా ఆర్ట్స్ బ్యానర్ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం అవుతుంది. ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగానే ఉంటుందట. త్వరలోనే ఈ సినిమాకు ముహుర్తం పెట్టబోతున్నారట.
ఇక ఈ సినిమా హీరోయిన్ విషయంలో బన్ని ఓ హీరోయిన్ విషయంలో పట్టుబడుతున్నాడట. భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కియరా అద్వాని ఆ సినిమా హిట్ అవడంతో రాం చరణ్ వినయ విధేయ రామ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. సంక్రాంతికి ఆ సినిమా రిలీజ్ కానుంది. ట్రైలర్ చూస్తే చరణ్, బోయపాటి కాంబోలో పవర్ పాక్డ్ గా వస్తున్న వి.వి.ఆర్ మూవీతో కూడా కియరా హిట్ కొట్టెలా ఉంది. ఇక ఇప్పుడు ఆ అమ్మడినే తన సినిమాలో హీరోయిన్ గా పెట్టుకోవాలని చూస్తున్నాడట బన్ని.
హీరోయిన్స్ డ్యాన్స్ చేయడంలో కాస్త వెనకపడి ఉంటారు ఆ విషయంలో కియరా అయితే తనకు కంఫర్ట్ అని భావిస్తున్నాడట బన్ని. వి.వి.ఆర్ లో కియరా తనకు మంచి డ్యాన్స్ పార్ట్ నర్ గా ఉందని చెర్రి చెప్పాడు. దాన్ని బట్టి హీరోయిన్స్ లో కియరా డ్యాన్స్ ఇరగదీస్తుంది అన్నమాట. మరి బన్ని, కితరా రొమాన్స్ కు త్రివిక్ర గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అన్నది చూడాలి. త్వరలో మొదలు కానున్న ఈ సినిమా ముహుర్తం రోజే టైటిల్ పోస్టర్ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.