సూపర్ స్టార్ రజనీకాంత్, సూపర్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘2.0’. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ విలన్గా నటించిన ఈ చిత్రంలో అమీ జాక్సన్ కథానాయికగా నటించింది. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ఐశ్వర్యారాయ్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో రజనీ, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ‘రోబో’లో ఐశ్వర్య కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే 2 .0 ట్రైలర్, మేకింగ్ వీడియోలు యూట్యూబ్ ను షేక్ చేసి అందరి అంచనాలు పెంచేసాయి. తాజాగా ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ కూడా ఓ పాత్రలో నటించబోతున్నట్టు బయటకి పొక్కడంతో అందరిలోనూ ఆసక్తి పెంచుతోంది. కానీ 2 .0 లో ఐశ్వర్య నటిస్తున్నట్టు ఇప్పటివరకు బయటకు తెలియకుండా చిత్ర యూనిట్ జాగ్రత్తలు తీసుకుంది.
కానీ ఇప్పడు ఆమె ఇందులో నటిస్తున్న విషయం బయటకి తెలియడంతో ఈ సినిమా మీద మరింత అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈ సినిమాలో ఆమె పాత్ర ఏంటి..? ఆ పాత్రకు ఉన్న ప్రాధాన్యత తదితర అంశాల గురించి మాత్రం తెలియరాలేదు. లైకా ప్రొడెక్షన్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మాణం పూర్తి చేసుకుంటోంది. మరి కొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది.