నటి అనుపమ పరమేశ్వరన్ తెలుగులో నటించింది అతి కొద్దీ సినిమాల్లోనే అయిన మంచి గుర్తింపు సంపాదించుకుంది. తనదైన నటనతో, హావభావాలతో తెలుగు ప్రేక్షకులని ఫిదా చేసింది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. ఇక అనుపమ తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తన మనసులో ఉన్న ఒక తీరని కొరిక మీడియా ఎదుట బయటపెట్టింది. అదేంటంటే తనకి ఏదైనా ఒక సినిమాలో ఒక పాట పాడాలని ఉందంట, ఎవరైనా సంగీత దర్శకుడు తన వద్దకు వచ్చి బాగా పాడమని ప్రోత్సహిస్తే మాత్రం, ఆమె తనలో ఉన్న సింగింగ్ టాలెంట్ ని చూపిస్తానని చెప్పింది. చూద్దాం అనుపమకు ఏ సంగీత దర్శకుడు ఈ అవకాశం ఇస్తారో.
ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో రామ్ హీరోగా నటిస్తున్న ” హలో గురు ప్రేమకోసమే ” చిత్రంలో నటిస్తుంది. ఇటీవలే ఈ చిత్ర టీజర్ మరియు ఒక లిరికల్ పాటని విడుదల చేసారు మూవీ యూనిట్ సభ్యులు. ఇక ఈ టీజర్ లో అనుపమ అందాలకి తెలుగు ప్రేక్షకులు మరోసారి ఫిదా అయిపోయారు. ఈ సినిమా ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అని దర్శకుడు ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 18న విడుదల చేయనున్నారు.