సాహో కి షాకిచ్చిన శ్రద్దా కపూర్

Google+ Pinterest LinkedIn Tumblr +

బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న ప్రెస్టిజియస్ మూవీ సాహో. సుజిత్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజ్ చేసే ఆలోచనతో ఈ సినిమాలో బీ టౌన్ బ్యూటీని హీరోయిన్ గా ఎంచుకున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ అనుకున్న విధంగా పూర్తవట్లేదు.

షూటింగ్ లేటుకి కారణం హీరోయిన్ శ్రద్ధా కపూర్ అని తెలుస్తుంది. మిగతా బాలీవుడ్ సినిమాలతో పాటుగా సాహోకి టైం కేటాయించిన శ్రద్ధా కపూర్ ఈ సినిమా షూటింగ్ టైంలో రీసెంట్ గా ఆమెకు డెంగ్యూ ఎటాక్ అయ్యిందట. దానితో ఆమె షూటింగ్స్ కు దూరంగా ఉందట. ప్రభాస్, శ్రద్ధా కపూర్ ల మధ్య కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ షూటింగ్ చేయాల్సి ఉందట.

అవి పూర్తయ్యాక మరిన్ని యాక్షన్ సీన్స్ షూట్ చేస్తారట. 2019 సమ్మర్ టార్గెట్ తో వస్తున్న సాహో సినిమా మరోసారి ప్రభాస్ స్టామినా ప్రూవ్ చేసేలా భారీ రికార్డులు సాధించడం ఖాయమని అంటున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. ఇలా తన బిజీ షెడ్యూల్ వలన సాహో చిత్ర యూనిట్ ఇన్ డైరెక్ట్ గా షాకిచ్చింది నటి శ్రద్దా కపూర్.

Share.