రెండు కాదు నాలుగంటున్న సైరా

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఎలాంటి న్యూస్ వచ్చినా ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఇటీవల ఈ చిత్ర టీజర్ రిలీజ్ అయ్యి సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది.

ఈ సినిమాలో ఔరా అనిపించే యాక్షన్ ఎపిసోడ్స్ ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది. ఇందులో మొత్తంగా నాలుగు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయట. అయితే ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కోసం రూ.50 కోట్ల బడ్జెట్ కేటాయించారనే వార్తలు ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తోన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కోసం కాదని.. నాలుగు యాక్షన్ ఎపిసోడ్స్‌కు కలిపి రూ.50 కోట్ల బడ్జెట్ సరిపోతుందని వారు తెలిపారు. అయితే ముందుగా ఈ సినిమాలో రెండు బారి యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని వార్తలు వినిపించాయి, కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మొత్తంగా నాలుగు బారి యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయని తెలుస్తుంది.

రెండు యాక్షన్ ఎపిసోడ్స్ ఫస్ట్ హాఫ్‌లో రెండు సెకండ్ హాఫ్‌లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయా అని ప్రేక్షకులు ఊహించుకుంటున్నారు.

Share.