విడుదలకు ముందే వివాదాల్లో అఖిల్ మిస్టర్ మజ్ను

Google+ Pinterest LinkedIn Tumblr +
అఖిల్ తన మొదటి సినిమా మీద ఎన్నో అంచానాలు పెట్టుకున్నాడు. మొదటి సినిమాతోనే స్టార్ హోదా దక్కించుకుని ఇండ్రస్ట్రీ లో సెటిల్ అయిపోవాలనుకున్నాడు. ఈ సినిమా పై ప్రేక్షకులు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు కానీ ఆ సినిమా నిరాశపరిచింది. రెండో సినిమాతో మాత్రం పర్లేదు అనిపించుకున్నాడు కానీ సినిమా అంతగా ఆడలేదు. దీంతో అఖిల్ తో పాటు నాగార్జున లో కూడా పట్టుదల పెరిగింది. ఎలాగైనా తన మూడో సినిమాతో ప్రేక్షకుల మనసు గెలుచుకోవాలని చూస్తున్నారు.
అఖిల్ మూడో సినిమాగా ఎన్నో అంచనాలతో వస్తున్న ‘మిస్టర్ మజ్ను’ విడుదల కాక ముందే వార్తల్లోకి ఎక్కుతోంది. ఈ సినిమా  ఓ హిందీ సినిమాకి ఫ్రీమేక్ అనే ప్రచారం సాగుతోంది. వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో ప్రస్తుతం సెట్స్ మీదున్న ‘మిస్టర్ మజ్నూ’ సినిమా రణబీర్ కపూర్ నటించిన ‘బచ్నా హే హసీనా’ సినిమాకి కాపీ అనే ప్రచారం ఊపందుకుంది. ‘తొలి ప్రేమ’ చిత్రంతో డీసెంట్ హిట్ కొట్టిన వెంకీ అట్లూరి ఈసారి అఖిల్‌కు సక్సెస్ ఇచ్చే బాధ్యతను తీసుకున్నాడు. ఆ ప్రయత్నంలో అఖిల్‌కు సూటయ్యే ఒక మంచి ప్రేమకథతో వస్తున్నాడు.
అయితే ఈ సినిమా హిందీ చిత్రం ‘బచ్నా హే హసీనా’ అనే సినిమాకి కాపీ అనే ప్రచారం జరుగుతుండడంతో ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియడం లేదు.  అయితే వెంకీ అట్లూరి స్ట్రైట్ కథతోనే నాగార్జునను మెప్పించాడని, అతడి టాలెంట్ మీద నమ్మకంతోనే అఖిల్‌కు హిట్టిచ్చే బాధ్యతను నాగ్ ఇతడికి అప్పగించినట్టు సమాచారం. ఈ సినిమాతో అయినా అఖిల్ హిట్ కొట్టకపోతే తన కెరియర్ గందరగోళంలో పడే ఛాన్స్ ఉంది.  ఇలా విడుదలకు ముందే అఖిల్ సినిమా పలు వివాదాల్లో చిక్కుకుంటుంది. చూద్దాం ఈ వార్తల పై చిత్ర యూనిట్ ఏ విధంగా స్పందిస్తుందో.
Share.