టాలీవుడ్లో ఇటీవల RX100 సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకుల్లో ముఖ్యంగా కుర్రకారులో వేడిపుట్టించింది బ్యూటీ పాయల్ రాజ్‌పూత్. ఆమె అందాల ఆరబోతతో పాటు బోల్డ్ సీన్స్‌లో ఎక్స్‌పోజింగ్‌కు కుర్రాళ్ల మతిపోయింది. ఈ సినిమాను మళ్ళీ మళ్ళీ చూసేందుకు జనాలు ఎగబడ్డారు అంటే ముఖ్య కారణం కూడా అదే అని అందరూ ఒప్పుకున్నారు. ఒక్కసినిమాతో ఎక్కడలేని ఫాలోయింగ్ మరియు క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ.
ఇప్పుడు పాయల్ ఎలాంటి సినిమా చేస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు జనాలు. కాగా భాను శంకర్ డైరెక్షన్లో ఒక సినిమా సైన్ చేసింది పాయల్. మరోవైపు తనకు వచ్చిన ఆఫర్లు ఎలాంటివైనా వదులుకోవడం లేదు ఈ బ్యూటీ. తాజాగా దర్శకుడు తేజ డైరెక్షన్లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో ఒక అదిరిపోయే ఐటెం సాంగ్‌లో అందాల ఆరబోతకు రెడీ అంటోంది పాయల్. కాగా ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.
బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాల్లో ఐటెం సాంగ్స్‌లో స్టార్ హీరోయిన్లు సైతం చిందులేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పాయల్ కూడా ఈ జాబితాలో చేరడంతో అమ్మడు ఎలాంటి స్టెప్స్‌తో చిందులేస్తుందో అని ఆశగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. మొత్తానికి బెల్లంకొండ బాబుతో రచ్చరంబోలా చేయడానికి రెడీ అవుతోంది పాయల్ బ్యూటీ.