అరవింద సమేతపై తారక్ సంచలన నిర్ణయం.. షాక్‌లో ఫ్యాన్స్!

Google+ Pinterest LinkedIn Tumblr +

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అరవింద సమేత శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు నందమూరి అభిమానులు. కాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

దసరా కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్న చిత్ర యూనిట్ ఈ సినిమా ఆడియో వేడుకను ఈ నెలలో జరుపుదామని అనుకున్నారు చిత్ర యూనిట్. కానీ తారక్ తండ్రి నందమూరి హరికృష్ణ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించడంతో తారక్ ఫ్యామిలీ శోకసంద్రంలోకి వెళ్లిపోయింది. ఇలాంటి సమయంలో తన సినిమా ఆడియో వేడుకను జరపడం సరికాదని తారక్ భావించాడు. అందుకే ఈ చిత్ర ఆడియో వేడుకను రద్దు చేయనున్నారు చిత్ర యూనిట్.

అయితే అక్టోబర్ నెలలో రిలీజ్ కానున్న అరవింద సమేత చిత్రాన్ని రిలీజ్ చేయనుండటంతో త్వరలో ఒక ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నిర్ణయంతో తారక్ ఫ్యాన్స్ షాక్‌కు గురయ్యారు.

Share.