తమిళ బ్యూటీ నయనతార ప్రస్తుతం కోలీవుడ్ హాట్ ఫెవరెట్ హీరోయిన్‌గా సక్సెస్ చిత్రాలతో దూసుకుపోతుంది. ఈమె చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద విజయాలుగా నిలుస్తుండటంతో ఈమెకు తమిళంలో పిచ్చ క్రేజ్ ఏర్పడింది. అయితే ఇప్పుడు ఈ క్రేజ్ ఆమె కొంపముంచినట్లు తెలుస్తుంది. కానీ దీనిలో మరో స్టార్ హీరోయిన్ చేయి కూడా ఉండటంతో నయన్ షాక్‌లో ఉండిపోయింది.
అసలు విషయం ఏమిటంటే.. తమిళ హీరో జయం రవి, నయనతార కలిసి నటించిన తని ఒరువన్ ఎలాంటి సక్సెస్ సాధించిందో అందరికీ తెలసిందే. ఆ సినిమా తమిళంలో భారీ విజయం అందుకోవడంతో తెలుగులో రామ్ చరణ్ హీరోగా ‘ధృవ’ అనే టైటిల్‌తో రీమేక్ చేస్తే.. ఇక్కడ కూడా అది బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. కాగా తనిఒరువన్ సినిమాలో నయన్ అందాల ఆరబోత మామూలుగా లేదు. ఇప్పుడు దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమా సీక్వెల్‌ను రెడీ చేస్తున్నాడు. ఈ సినిమాలో నయనతార స్థానంలో అందాల బ్యూటీ కాజల్ అగర్వాల్‌ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నయన్ క్రేజ్, ఆమె తీసుకునే భారీ రెమ్యునరేషన్ లాంటివి పక్కనబెడితే స్టార్ హీరోల స్థాయిలో ఆమె సినిమాలు ఆడుతుండటంతో దర్శకుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తని ఒరువన్ సీక్వెల్‌లో నయన్ హీరోయిన్ అయితే హీరోను డామినేట్ చేయడం ఖాయం అని భావించిన దర్శకుడు ఈ నిర్ణయానికి వచ్చాడట.
ఇలా ఒక మంచి చిత్రంలో తనను తీసుకోకపోవడాన్ని నయన్ జీర్ణించుకోలేకపోతుంది. మరోవైపు తన ప్రమేయం లేకపోయినా కాజల్‌ను నయన్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తుండటంతో అటు కాజల్ కూడా బాధపడుతోందట. ఏదేమైనా నయన్‌కు మన చందమామ చుక్కలు చూపించేసింది అని తెలుగు ప్రేక్షకులు మురిసిపోతున్నారు.