మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా రాబోతున్న సైరా నరసింహా రెడ్డి సినిమా సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూ విషయంలో తర్జ భర్జన జరుగుతుండగా ఫైనల్ గా అంతా సెట్ అయ్యిందని అనుకున్నారు.
ఇక లేటెస్ట్ గా సినిమాలో కాస్టూం డిజైనర్ మార్పు జరిగిందట. సైరా కోసం మొదట బాలీవుడ్ కాస్టూం డిజైనర్ అంజు మోడీని తీసుకున్నారట. బాజీ రావు మస్తాని సినిమాకు ఆమె కాస్టూం డిజైన్ చేశారు. ఆ రిఫరెన్స్ తో సైరాకు క్యాస్తూన్ డైజర్ గా అంజుని ఓకే చేశారు. కాని రాయలసీమ చరిత్ర స్థితిగతులు ఏమాత్రం ఐడియా లేని అంజు కాస్టూం డిజైనింగ్ దర్శకుడు సూరికి నచ్చట్లేదట.
అందుకే అంజు ప్లేస్ లో చిరంజీవి పెద్ద కూతురు సుస్మితని రంగంలో దించారు. ఖైది నంబర్ 150 సినిమాకు చిరు కాస్టూం డిజైనర్ గా సుస్మిత పనిచేశారు. సైరా కోసం కూడా ఆమె పనిచేయడం విశేషం.
