బన్నీతో కాలేని పని తారక్ చేస్తాడంటున్న బ్యూటీ!

Google+ Pinterest LinkedIn Tumblr +

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అరవింద సమేత దసరా కానుకగా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాతో తారక్ మరోసారి విధ్వంసం సృష్టిస్తాడని తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. కాగా తారక్‌పైనే తన నమ్మకాలను పెట్టుకుంది అందాల భామ పూజా హెగ్డే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వల్ల కాని పని కేవలం తారక్ మాత్రమే చేస్తాడంటూ ఆమె ధీమా వ్యక్తం చేస్తోంది.

బన్నీ చేయలేని పని తారక్ చేయడం ఏమిటి అనుకుంటున్నారా.. అసలు విషయం ఏమిటంటే.. డీజే సినిమాలో బన్నీ సరసన నటించిన పూజా హెగ్డే ఆ సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకుంది. అయితే ఆ సినిమా కమర్షియల్ హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ అమ్మడికి కావాల్సినంత ఇమేజ్‌ను మాత్రం తీసుకురాలేదు. ఆ తరువాత రామ్ చరణ్ రంగస్థలంలో ఒక ఐటెం సాంగ్‌లో చిందులేసింది ఈ హాట్ బ్యూటీ. కానీ ఈ సినిమాలో అసలు జిగేలు రాణి మాత్రం సమంత. ఆమె ముందు పూజా హెగ్డేను గుర్తుకు కూడా చేసుకోలేకపోయారు జనం.

అందుకే ఇప్పుడు ‘అరవింద సమేత’ చిత్రంతో ఎలాగైన తన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకోవాలని చూస్తోంది ఈ భామ. మాస్‌లో తారక్‌కు ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకుని తాను కూడా కొంచెం ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటోంది. మరి ఈ డీజే బ్యూటీ సౌండ్‌కు తారక్ ఫ్యాన్స్ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో తెలియాలంటే దసరా వరకు ఆగాల్సిందే.. అదేనండి.. చిత్రం రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చెయ్యాల్సిందే.

Share.