నటి నయనతార తెలుగులోనే కాకుండా సౌత్ ఇండియా అంతటా క్రేజ్ ఉన్న హీరోయిన్. అందుకే కాబోలు తాను నటించిన సినిమా ‘ కొలమావు కోకిల ‘ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక స్టార్ హీరోలకి సైతం సొంతం కానీ కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది ఈ సినిమా. నయనతార లీడ్ రోల్ లో నటించిన ‘ కొలమావు కోకిల ‘ తమిళ నాట విడుదలై 10 రోజులైనా కాకముందే ఒక్క తమిళ రాష్ట్రము లోనే సుమారు రూ 20 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ పండితుల విడుదల చేసిన రిపోర్ట్ లో తేలింది.
ఎంతో మంది అగ్ర హీరోలకి సాధ్యం కానీ ఈ ఘనతని నయనతార సాధించటం తో సినీ వర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసాయ్. ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాకి ఈ స్థాయిలో కలెక్షన్స్ రావటం నిజంగా ఒక్క నయనతార కే సొంతం. ఏ మాత్రం గ్లామర్ షో లేకుండా కేవలం తన నటన, సినిమా కథ, కథనం తో ఈ ఫీట్ సాధించటం నిజముగా అరుదుగా జరుగుతుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ‘ కొలమావు కోకిల ‘ సినిమాకి నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ సినిమా ‘ కో కో కోకిల ‘ పేరుతో ఈ నెల 31వ తేదీన విడుదల కానుంది.