నటి క్రితి సనాన్ తెలుగులో మహేష్ సరసన వన్ సినిమాలో నటించి ఇక్కడి ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్నారు. అటు తర్వాత తనకి తెలుగులో అవకాశాలు వచ్చిన ఆమె మాత్రం బాలీవుడ్ వైపు పరుగులు తీసింది. అక్కడ కూడా క్రితి కి మంచి అవకాశాలే వచ్చాయ్. గత కొన్ని రోజులుగా హీరో సుశాంత్ సింగ్ రాజ్ ఫుట్ తో ఈ అమ్మడు డేటింగ్ లో ఉందని అందరికి తెలిసిందే. రాబితా సినిమాలో వీరిద్దరూ కలిసి నటించిన సమయం నుండి వీరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తూనే ఉంది. ఆ చిత్ర షూటింగ్ సమయంలో కూడా వీరిద్దరూ చెట్టపట్టాలు వేసుకుంటూ తిరిగారు. సుశాంత్ క్రితి చెల్లెలు నుపుర్ సనాన్ ని కూడా తన బాలీవుడ్ డెబ్యూ చిత్రం కోసం అన్ని విధాలుగా సహకరిస్తున్నాడట.
అయితే గత కొన్ని రోజులుగా వీరి ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టిందని బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. అయితే పలు పత్రికల్లో దీనికి ప్రధాన కారణం సుశాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘కీజి ఔర్ మ్యానీ’ హీరోయిన్ సంజన తో అతను బాగా సన్నిహితంగా ఉంటున్నాడని సమాచారం. ఇది నచ్చని క్రితి కొన్ని రోజుల క్రితం అతనికి బ్రేక్ అప్ చెప్పిందట.