సైరా లో పవర్ ఫుల్ డైలాగ్ లీక్ చేసిన పరుచూరి బ్రదర్స్

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగాస్టార్ చిరంజీవి సైరా చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రం టీజర్ ని చిరు పుట్టిన రోజు సందర్భంగా 21 న విడుదల చేసారు చిత్ర నిర్మాత రామ్ చరణ్ మరియు చిరంజీవి అమ్మ గారు అంజనా దేవి. టీజర్ లో చిరు లుక్ మరియు విజువల్స్ అద్భుతంగా ఉన్నాయ్. చిరు పలికిన ‘ ఈ యుద్ధం ఎవరిది ‘ అనే డైలాగ్ కూడా అభిమానులని ఆకట్టుకుంది. టాలీవుడ్ లో తొలిసారిగా అమిత్ త్రివేది ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి పరుచూరి సోదరులు మరియు బుర్ర సాయి మాధవ్ స్క్రిప్ట్ మరియు డైలాగ్స్ ని అందిస్తున్నారు.

ఇక తాజాగా జరిగిన ఒక ప్రెస్ మీట్ లో ఈ సినిమా రచయిత పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ ఈ సినిమాలోని కొన్ని కీలకమైన డైలాగ్స్ ని మీడియా తో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ డైలాగ్ సోషల్ మీడియా లో హాల్ చల్ చేస్తుంది.
చిరంజీవిని బ్రిటిష్ వారు ఊరి తీస్తున్న సమయంలో వచ్చే ఈ డైలాగ్ ఏంటంటే ” చేతులు విరిచేసాం, ముఖం ముందు ఉరితాడు ఉంది, ఏంట్రా నీ ధైర్యం..? అని విలన్ అడగ్గా సైరా బదులుగా చచ్చి పుట్టిన వాడిని, చనిపోయిన తర్వాత కూడా బతికే వాడిని, నాకెందుకరా భయం” అని చిరు చెప్తాడట.
వింటుంటేనే ఇలా ఉంటె సినిమాలో ఈ డైలాగ్ చిరు నోటా వింటే ఇక అభిమానులకి పూనకాలే.

సైరా చిత్రం సుమారు రూ 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది. నయనతార ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించగా, ప్రముఖ బాలీవుడ్ నటుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

Share.