దశాబ్ధన్నర పైగా సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా ఉన్న ఓ సీనియర్ హీరోయిన్ తెలుగులో కూడా మంచి పాపులారిటీ సంపాదించింది. అయితే కొత్త హీరోయిన్స్ రావడంతో ఆమెకు ఛాన్సులు తగ్గాయి. సీనియర్ స్టార్స్ తో అందరితో కలిసి నటించిన ఈ హీరోయిన్ ఇప్పటి స్టార్స్ కెరియర్ మొదట్లో జోడీ కట్టేసింది. అయినా సరే ఇప్పటికి చిన్న చిన్న పాత్రలతో సరిపెట్టుకుంటుంది ఈ అమ్మడు.
సినిమాలు చేస్తున్న చేయకపోయినా సరే అవార్డ్ ఫంక్షన్స్ లో, ఏదైనా సినిమా ఈవెంట్ లో మాత్రం ఆమె డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉండాల్సిందే. అయితే ఈ హీరోయిన్ ఈమధ్య ఓ కొత్త అలవాటు నేర్చుకుందట. అదేంటి అంటే ఎక్కడ పడితే అక్కడ సిగరెట్ తాగుతూ కనిపిస్తుందట. హీరోయిన్ ఈ కొత్త అలవాటు వల్ల ఈవెంట్ మేనేజర్లు కాస్త ఇబ్బంది పడుతున్నారట. ఈమధ్య ఓ షూటింగ్ సెట్స్ లో కూడా ఆమె సిగరెంట్ కాల్చుతుంటే యూనిట్ అంతా షాక్ అయ్యారట.
ఏదో సినిమాలో ఓ సీన్ కోసం కనిస్తే తప్పు కాని ఇలా ఎక్కడ పడితే అక్కడ చైన్ స్మోకర్ గా పొగ తాగడం మాత్రం షాకింగ్ అని చెప్పొచ్చు. అయితే ఆమె సిగరెట్ తాగుతున్న ఫోటోలు ఒక యూనిట్ సభ్యులు ఫోటో తీస్తే మేనేజర్ తో చెప్పించి ఆ పిక్ డిలీట్ చేసే వరకు టెన్షన్ పడ్డదట. ఈమధ్య ఓ ఈవెంట్ లో కూడా డ్యాన్స్ ప్రోగ్రాం కు ముందు అందరి ముందే ఆమె సిగరెట్ తాగి అందరికి షాక్ ఇచ్చిందట. మరి ఈ సీనియర్ హీరోయిన్ కు సిగరెట్ అలవాటు ఎలా అయ్యిందో ఏమో కాని దాని వల్ల ఆమెతో ప్రోగ్రాంస్ చేసే వారు మాత్రం ఇబ్బంది పడుతున్నారట. సదర్ హీరోయిన్ సిగరెట్ ఎడిక్షన్ నుండి బయటకు వచ్చేలా చూసుకుంటే బెటర్ లేదంటే ఇన్నాళ్లు అభిమానించిన ఫ్యాన్స్ ఆమెకు దూరమయ్యే అవకాశం ఉంది.