‘ సాహో ‘ ను ఇవే కాపాడాలి…

Google+ Pinterest LinkedIn Tumblr +

భారీ అంచనాల మధ్య విడువులైన సాహో అంద‌రి అంచ‌నాలు త‌ల్ల‌కిందులు చేస్తూ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. జ‌నాల్లో ఉన్న అంచ‌నాల‌తో పోలిస్తే సాహోకు వ‌చ్చిన టాక్ గొప్ప‌గా లేదు. ఈ రోజు సాయంత్రానికి సాహో పూర్తి టాక్ వ‌చ్చేయ‌నుంది. ఇదిలా ఉంటే సాహోకు ఇప్పుడు రిలీజ్ ప‌రంగా స‌రైన టైం సెట్ అయ్యింది. సోలో రిలీజ్ కావ‌డంతో పాటు బాలీవుడ్‌, కోలీవుడ్‌లో సైతం స్టార్ హీరోలు త‌మ సినిమాల విడుద‌ల వాయిదా వేసుకుని మ‌రీ సాహోకు దారి ఇచ్చాయి.

ఇక తెలుగులో కూడా సాహోకు రెండు వారాల పాటు ఎదురు లేకుండా ఉంది. వారంతంతో పాటు సోమ‌వారం వినాయ‌క చ‌వితి సెల‌వు క‌లుపుకుంటే నాలుగు రోజుల పాటు సాహోకు సుదీర్ఘ వీకెండ్ క‌లిసి వ‌చ్చింది. వచ్చే వారం కూడా పెద్ద సినిమాల విడుదల లేదు. వచ్చే వారం అనగా సెప్టెంబర్ 6న ఆది సాయి కుమార్ – శ్ర‌ద్ధా శ్రీనాథ్ జంట‌గా నటించిన జోడి తో పాటు ఉండిపోరాడే అనే మరో చిన్న చిత్రం విడుదల కానుంది.

జోడీ క్లాస్ ఫ్యాన్స్‌ను టార్గెట్ చేసుకున్న‌ట్టుగా క‌న‌ప‌డుతోంది. సాహోకు ఆ సినిమాతో వ‌చ్చిన పోటీ ఏం ఉండ‌దు. అది ఏ సెంట‌ర్ల‌లో మాత్ర‌మే ప్ర‌భావం చూపుతుంది. ఎలా లేద‌న్నా సాహో రెండు వారాల పాటు బీ, సీ సెంట‌ర్ల‌లో కంటిన్యూ కానుంది. ఈ వారం వ‌స్తోన్న రెండు సినిమాలు సాహోకు ఏ మాత్రం పోటీ కాదు. కాబట్టి మరో వారం సోలో వీకెండ్ లభించినట్లే లెక్క.

కాబట్టి సెప్టెంబర్ 13న గ్యాంగ్ లీడర్ విడుదల అయ్యేవరకు సాహో కి తెలుగులో పోటీ ఇచ్చే సినిమానే లేదు. కాబట్టి సాహో యావ‌రేజ్ టాక్‌తో ఎలాంటి వ‌సూళ్లు రాబ‌డుతుంది… ఈ సానుకూల‌త‌ను బాగా యూజ్ చేసుకుంటుందా ? లేదా ? అన్న‌ది ప్ర‌భాస్ స్టామినా మీద బేస్ అయ్యి ఉంటుంది.

Share.