రివ్యూల వ‌ల్లే సాహో ప్లాప్ అయ్యిందా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్ర‌భాస్ హైఓల్టేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ రిలీజ్‌కు ముందు ఎంత తీవ్ర ఉత్కంఠ రేపిందో రిలీజ్ అయ్యి టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చాక ఆ ఉత్కంఠ ఒక్క‌సారిగా పేలిపోయిన‌ట్ల‌య్యింది. ప్రేక్ష‌కులు ఎన్నో అంచ‌నాల‌తో థియేటర్ల‌లోకి అడుగు పెడితే అక్క‌డ సుజీత్ ఇచ్చిన ట్విస్టుల సంగ‌తేమో గాని బోరింగ్ ట్రీట్మెంట్‌తో ప్రేక్ష‌కులు మైండ్ దొబ్బిన‌ట్ల‌య్యింది. కేవ‌లం యాక్ష‌న్ మీద‌, స్టైలీష్ టేకింగ్ మీద కాన్‌సంట్రేష‌న్ చేసిన సుజీత్ క‌థ‌, క‌థ‌నాల‌ను గాలికి వ‌దిలేశాడు.

ఏదేమైనా సాహోకు అనుకున్న టాక్ రాలేదు. ఇక సాహోకు అర్ధ‌రాత్రి షోలు ప‌డడంతో ఉద‌యానికే చాలా సైట్లో రివ్యూలు మిక్స్‌డ్‌గా వ‌చ్చేశాయి. వాస్త‌వానికి ఈ సినిమాకు చిన్న చిన్న వెబ్‌సైట్లు దాదాపు యేడాది కాలంగా భారీ ఎత్తున ప్ర‌చారం చేశాయి. బాహుబ‌లి త‌ర్వాత ప్రభాస్ చేసిన సినిమా కావ‌డంతో ప్రభాస్‌కు వ‌చ్చిన నేష‌న‌ల్ స్టార్‌డ‌మ్‌ను కంటిన్యూ చేసేలా వీళ్లంతా త‌మ వంతుగా సాయం చేశారు.

ఇవ‌న్నీ యేడాది కాలంగా సోష‌ల్ మీడియాలో బాగా హైప్ అయ్యాయి. చివ‌ర‌కు ప్రేక్ష‌కులు ఎన్నో ఆశ‌ల‌తో, భారీ అంచ‌నాల‌తో థియేటర్‌కు వెళితే అక్క‌డ వాళ్ల అంచ‌నాలు అన్ని త‌ప్పేశాయి. దీంతో ప్రేక్ష‌కుడు షాక్ అవ్వ‌క త‌ప్ప‌లేదు. ఇక అదే టైంలో వెబ్‌సైట్లో ఓవ‌ర్సీస్ నుంచి రివ్యూలు కాస్త మిక్స్‌డ్‌, నెగిటివ్‌గా స్ప్రెడ్ అయ్యాయి. సోష‌ల్ మీడియాలోనూ టాక్ బాగా రాలేదు. ఇవ‌న్నీ మైన‌స్ అయ్యాయి.

Share.