వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా హత్యోందంతం అందరిని షాక్ అయ్యేలా చేసింది. ఇలాంటి మానవ మృగాల మధ్యనా మనం జీవిస్తుంది అన్న భావన కలుగుతుంది. ఇప్పటికే జస్టిస్ ఫర్ దిశ గురించి సెలబ్రిటీస్ అందరు తమ స్పందన తెలియచేశారు. అయితే ఏదైనా విషయం జరిగిన తర్వాత వచ్చే స్పందన కన్నా దాన్ని జరుగక ముందే అడ్డుకడితే బాగుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఈ విషయంపై తమిళ సింగర్ చిన్మయి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. తనతో వైరముత్తు అసభ్యంగా ప్రవర్తించాడని తాను చెప్పినా ఎవరు పట్టించుకోలేదని.. అతను నా నడుము పట్టుకుని ముద్దుపెట్టుకున్నాడని నేను ఎలా ప్రూవ్ చేయాలని అన్నారు చిన్మయి. ఏదైనా ఘోరం జరిగిన తర్వాత అయ్యో పాపం అనుకునే కన్నా నాలా ధైర్యంగా చెప్పే వారికి మీ సపోర్ట్ ఉండట్లేదని ఆమె వాపోయింది.
మీటూ లో భాగంగా చిన్మయి రైటర్ వైరముత్తు మీద సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే ఛాన్స్ దొరికితే చాలు చిన్మయి ఈ ఇష్యూపై వరుసగా ట్వీట్స్ వేస్తూనే ఉంటుంది. అయితే లేటెస్ట్ గా మరోసారి ప్రియాంకా రెడ్డి ఘటనపై తన గొంతు వినిపిస్తుంది చిన్మయి ఇలాంటివి జరిగినట్టు అయ్యో పాపం అనుకునే కన్నా ఇలా జరుగుతుందని ధైర్యంగా చెప్పిన మహిళలను గౌరవించండని ఆమె అంటుంది.