లిప్ లాకులు.. హాట్ సీన్స్ సినిమాను చెండాలం చేస్తున్నారుగా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఈమధ్య కాలంలో తెలుగులో ఊహించని విధంగా కొన్ని అద్భుతమైన సినిమాలు వస్తున్నాయి. స్టార్ సినిమాలేమో కమర్షియల్ గా అదరగొడుతుంటే చిన్న సినిమాలు మాత్రం కంటెంట్ బేస్ తో సత్తా చాటుతున్నారు. ఇదిలాఉంటే ఇక సందట్లో సడేమియా అన్నట్టుగా కొన్ని అభ్యతరకరమైన సినిమాలు వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు బీ గ్రేడ్ సినిమాలనే ఇప్పుడు పేరు మార్చి అడల్ట్ కామెడీ అనేస్తున్నారు.

ఇలాంటి సినిమాల్లో హీరోయిన్ తో సినిమా మొత్తం లిప్ లాక్స్, హాట్ సీన్స్ మాత్రమే ఉంటాయి. విప్పి చూపించడం.. ముద్దు ముచ్చట్లతోనే సినిమా నింపేస్తున్నారు. చేసేదంతా చేసి చివర్లో ఓ మెసేజ్ ఇచ్చి ఇలా చేయకూడదని చెబుతారు. ఒకప్పుడు షకీలా సినిమాలు కూడా ఇంత దారుణంగా లేవని చెప్పొచ్చు. రీసెంట్ గా వచ్చిన పాయల్ రాజ్ పుత్ ఆర్.డి.ఎక్స్ లవ్ ఈ కేటగిరిలోకే వస్తుంది.

ఇక నిన్న రిలీజైన ఏడు చేపల కథ ట్రైలర్ చూస్తే ఇది పక్కా బీ గ్రేడ్ సినిమా అనిపించకమానదు. దర్శకుడు ఏం చెప్పదలచుకున్నాడో ఏమో కాని ఏడు చేపల కథ మొత్తం బూతు కంటెంట్ తో నిండి ఉంది. ఇప్పటి యూత్ ఆడియెన్స్ ను గాలెం వేసేలా ఇలాంటి సినిమాలు చేస్తున్నా ఓ విధంగా సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా ఈ సినిమాలు ప్రేరేపితం చేస్తాయని మాత్రం చెప్పొచ్చు. మరి సినిమాల్లో సెన్సార్ మరింత కఠినతరం కావాల్సిన పరిస్థితి ఉందని సిన్సియర్ సిని ప్రేముకులు కోరుకుంటున్నారు.

Share.