నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరక్షన్ లో బాలయ్య బాబు 106వ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఐకాన్ అన్న టైటిల్ ప్రచారంలో ఉంది. అసలైతే అల్లు అర్జున్, దిల్ రాజు కాంబో మూవీకి ఐకాన్ టైటిల్ అనుకున్నారు కాని ఆ ప్రాజెక్ట్ అటకెక్కడంతో ఆ టైటిల్ దిల్ రాజు బాలకృష్ణ కోసం త్యాగం చేసినట్టు తెలుస్తుంది. ఇదిలాఉంటే ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్ హాని దించుతున్నారని వార్తలు వచ్చాయి.
దబాంగ్ బ్యూటీ సోనాక్షికి అక్కడ మంచి క్రేజ్ ఉంది. అయితే ఈమధ్య కెరియర్ లో కాస్త వెనుకపడినట్టు కనిపించిన సోనాక్షి మళ్లీ పుంజుకోవాలని చూస్తుంది. ఇంతవరకు సౌత్ లో ఒక్క సినిమా కూడా చేయని సోనాక్షి తెలుగులో బాలయ్య పక్కన ఛాన్స్ పట్టేసిందని అంటున్నారు. అయితే ఈ విషయం ఆనోటా ఈనోటా పడి ఆమె దాకా వెళ్లింది. అయితే లేటెస్ట్ గా ఆమె ట్విట్టర్ లో తాను తెలుగు సినిమా చేయట్లేదని చెప్పింది.
సింహా, లెజెండ్ తర్వాత బాలకృష్ణ తో బోయపాటి చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తప్పకుండా ఆశించిన స్థాయిలో ఉంటుందని అంటున్నారు. బోయపాటి మార్క్ మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది.