బాబాయ్‌ను లైట్ తీస్కొని అన్న‌కు సాయం చేస్తోన్న ఎన్టీఆర్‌…!

Google+ Pinterest LinkedIn Tumblr +

జూనియర్ ఎన్టీఆర్, ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ నిజంగానే బాలకృష్ణకు దూరంగా ఉన్నారా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ఇటీవల బాలకృష్ణ నటించిన రూలర్ సినిమాకు సంబంధించి ఏ కార్యక్రమంలోనూ తారక్ గాని కళ్యాణ్ రామ్ గాని పాల్గొనలేదు. నందమూరి అభిమానులు పాల్గొనాలని కోరారు. అయినా సరే జూనియర్ నుంచి మాత్రం ఏ స్పందనా లేదనే చెప్పాలి. దీనితో వీళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. చాలా మందికి ఒక స్పష్టత కూడా వచ్చేసింది.

తాజాగా ఒక కీలక పరిణామ౦ చోటు చేసుకుంది. తారక్, తన అన్న కళ్యాణ్ రామ్ సినిమా ప్రమోషన్ లో పాల్గొంటున్నాడు. సంక్రాంతికి `సరిలేరు నీకెవ్వరు`, `అల వైకుంఠపురములో..`, `దర్బార్` చిత్రాలతోపాటు నందమూరి కల్యాణ్‌రామ్ నటించిన `ఎంత మంచివాడవురా` కూడా ప్రేక్షకుల ముందుకి వస్తుంది. దీనితో బాక్సాఫీస్ వద్ద పెద్ద ఎత్తున సందడి వాతావరణం నెలకొంది. కళ్యాణ్ రామ్ సినిమా మినహా మిగిలిన మూడు సినిమాలు కూడా ప్రచారంలో మంచి దూకుడు ప్రదర్శిస్తున్నాయి.

దీనితో తన అన్న సినిమా ప్రచార బాధ్యతలను తారక్ తీసుకున్నాడు. `ఎంత మంచివాడవురా` సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ జనవరి మొదటి వారంలో జరుగుతుంది. దీనికి తారక్ హాజరు కావాలని భావిస్తున్నాడు. జనవరి 15 న విడుదల అయ్యే ఈ సినిమా కోసం ప్రచారం చెయ్యాలని కూడా భావిస్తున్నాడు. ఎన్టీఆర్ వస్తే ఆ సినిమా క్రేజ్ మరో రేంజ్ కి వెళ్తుంది. బాబాయ్ సినిమా మీద కనీసం మాట్లాడని తారక్ ఈ విధంగా తన అన్న సినిమాకు హాజరు కావడంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Share.