ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్న పూజా హెగ్దె ఒకప్పుడు తెలుగులో ఐరన్ లెగ్ అన్నారు. ముకుంద, ఒక లైలా కోసం సినిమాల టైం లో ఆమెకు ఐరన్ లెగ్ ఇమేజ్ వచ్చింది. అయితే బన్నితో చేసిన డిజే సినిమాతో అమ్మడి దశ తిరిగింది. వరుస స్టార్ సినిమాలతో నటిస్తూ కెరియర్ ఫుల్ జోష్ లో ఉన్న పూజా తెలుగు ఆడియెన్స్ ను తన మత్తులో పడేసుకుంది. ఇక లేటెస్ట్ గా తనకి వస్తున్న ప్రపోజల్స్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది పూజా హెగ్దె.
సోషల్ మీడియాలో తనకు చాల లవ్ ప్రపోజల్స్ వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని ప్రస్థావిస్తూ తనని పడేయాలంటే మీరు ఏదేదో చేయాల్సిన పనిలేదు మంచి భోజనం పెడితే చాలని అంటుంది పూజా హెగ్దె. అదేంటి అంటే అమ్మడు భోజన ప్రియురాలు సరైన భోజనం పెడితే అలాంటోడికి తాను పడిపోతా అంటుంది. అంతేకాదు నిజాయితీగా ఉండే వారంటే ఇష్టమని చెప్పొచ్చింది.
తన జీవితంలో పెళ్లి గురించి ఇంకా ఆలోచించలేదని. తనని పడేయాలంటే మాత్రం చాలా ఈజీ అని అంటుంది అమ్మడు. తెలుగులో టాప్ హీరోయిన్ రేంజ్ కు వెళ్లిన ఈ బ్యూటీ మరో ఐదేళ్ల దాకా ఇక్కడ సూపర్ ఫాం కొనసాగించేలా ఉంది. మరి ఈ అమ్మడిని చివరకు ఎవరు పడేస్తారో చూడాలి.