పాకిస్థాన్ వీడియోలో పూనం కౌర్ స్పెషల్ ఎట్రాక్షన్..

Google+ Pinterest LinkedIn Tumblr +

సిక్కుల ఆది గురువు శ్రీ గురునానక్ దేవ్ 550వ జయంతి వేడుకలు ఈ నెల 9న పాకిస్థాన్ లోని కర్తార్‌పూర్లో ఘనంగా జరగనున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలకు వేలాది మంది భారతీయులు కర్తార్‌పూర్ కు వెళ్లనున్నారు. ఇండియాలోని పంజాబ్‌లో ఉన్న డేరా బాబా నానక్‌ గురుద్వారా నుంచి పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లో ఉన్న కర్తార్‌పూర్‌లో ఉండే గురుద్వారా వరకు వెళ్లేందుకు భారత్, పాకిస్తాన్ మధ్య ఇప్పటికే ఒప్పందం కుదిరింది.

ఈ నెల 9న నిర్వహించనున్న కర్తార్‌పూర్ ప్రారంభోత్సవానికి మొదటి ఆహ్వానాన్ని నవ్‌జోత్ సింగ్ సిద్ధు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి తొలి ఆహ్వానాన్ని పాక్ ప్రధాని ఇమ్రాన్.. నవ్‌జోత్ సింగ్ సిద్ధుకు పంపించారు. ఈ కార్యక్రమాన్ని భారత్ పాకిస్థాన్‌లు విడివిడిగా నిర్వహించనున్నాయి. ఇక ఈ కార్యక్రమం సందర్భంగా పాకిస్థాన్ దేశం దీనికి సంబంధించిన స్వాగత వీడియో ఒకటి విడుదల చేసింది. అయితే ఆ వీడియోలో నటి పూనం కౌర్ కూడా ఉంది.

ఈ సాంగ్ లో పూనం కనిపించండపై పాకిస్థాన్ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియోలో మీరు ప్రతిచోటా ఉన్నారని, మిమ్మలని చూస్తే గర్వంగా ఉంది సోదరి అంటూ పాకిస్థాన్ నెటిజన్ కామెంట్ చేశారు. అదే కామెంట్ ని పూనం తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, పాకిస్థాన్ వీడియోని కూడా పోస్ట్ చేసింది. ఇక తెలుగు యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న పూనం, ఇటీవల ట్విట్టర్ వేదికగా పవన్ కల్యాణ్ పై పరోక్షంగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అలా పవన్ పై విమర్శలు చేసే పూనం ఇప్పుడు పాకిస్థాన్ వీడియోలో కనిపించడం చర్చనీయాంశమైంది. మరి దానిపై మనవాళ్లు ఎలా స్పందిస్తారో చూడాలి.

Share.