పవన్ దెబ్బకు దిల్ రాజు విసిగిపోయారా…?

Google+ Pinterest LinkedIn Tumblr +

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. బాలివుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అక్కడ అమితాబ్ బచ్చన్ పాత్రలో… ఇక్కడ పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలయింది. ఈ సినిమాకు తెలుగులో వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తుండగా బోణీ కపూర్, దిల్ రాజు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం… దీనితో ఆయన అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సిని విశ్లేషకులు కూడా ఈ సినిమాపై భారి అంచనాలే వేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. సినిమా షూటింగ్ విషయంలో పవన్ కళ్యాణ్ దిల్ రాజు ని ఇబ్బంది పెడుతున్నారని టాలివుడ్ వర్గాలు అంటున్నాయి.

ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నారు. మార్చ్ నుంచి షూటింగ్ లో ఉంటా అని చెప్తున్నారట. దీనికి దిల్ రాజు అంగీకరించడం లేదని అంటున్నారు. ఇప్పటికే సినిమా ఆలస్యమవుతుందని, దానికి పవన్ కూడా కారణం అనే భావనలో చిత్ర యూనిట్ ఉంది. దిల్ రాజు, బోణీ కపూర్ కూడా పవన్ తో ఇదే విషయాన్ని చెప్పారు. అయినా సరే తాను 20 రోజులు మాత్రమె షూటింగ్ లో ఉండగలనని చెప్తున్నారట. ఈ చిత్రంలో నివేదా థామ‌స్‌, అంజ‌లి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Share.