త్రివిక్రం హ్యాండ్ తో ఆ యాంకర్ ఫేట్ మారిపోయింది..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మాటల మాంత్రికుడు చేతిలో పడితే ఎవరి ఫేట్ అయినా మారాల్సిందే. ప్రస్తుతం ఓ బుల్లితెర యాంకర్ పరిస్థితి చూస్తే అలానే ఉంది. అంతకుముందు సీరియల్స్ లోనూ సినిమాల్లో అడపాదడపా కనిపించే హరితేజ బిగ్ బాస్ ద్వారా చాలా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత త్రివిక్రం అఆలో ఛాన్స్ పట్టేసిన ఈ అమ్మడు ఇక ప్రతి త్రివిక్రం సినిమాలో నటిస్తూ వస్తుంది. సినిమాలో అక్క, వదిన, పని మనిషి ఇలాంటి ఏ పాత్ర అయినా చేస్తూ వస్తున్న హరితేజ ప్రస్తుతం తెలుగులో సూపర్ క్రేజ్ ఏర్పరచుకుంది.

ఫ్య్మాఇలీ సినిమా వస్తుంది అంటే అందులో హరితేజ కచ్చితంగా ఉంటుంది. త్రివిక్రం సినిమా అంటే ఆమె రెమ్యునరేషన్ గురించి కూడా అడగకుండా డేట్స్ ఇచ్చేస్తుందట. ఓ పక్క బిగ్ బాస్ తర్వాత ఆమె బుల్లితెర మీద కూడా చాలా ఫేమస్ అయ్యింది. త్రివిక్రం హ్యాండ్ పడ్డాక హరితేజ ఫేట్ మారిపోయిందని చెప్పొచ్చు.

సినిమాలో చిన్న పాత్రే అయినా ఆమె ఇచ్చే డేట్స్ బాగానే ఉంటాయి. డైలాగ్స్ ఉన్నా లేకున్నా సినిమాలో ఫ్యామిలీ సీన్స్ లో కనిపిస్తుంది హరితేజ. అందుకే ఈమధ్య ఆమెకు మంచి డిమాండ్ ఏర్పడిందని తెలుస్తుంది.

Share.