తమిళంలో తారక్ క్రేజ్ పెరుగుతుందా…?

Google+ Pinterest LinkedIn Tumblr +

తమిళంలో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ పెరుగుతుందా…? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. ప్రస్తుతం తారక్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అయిన తర్వాత వరుస సినిమాలు చేయడానికి కూడా సిద్దంగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా మీద దృష్టి సారించడంతో ఇతర సినిమాలను పెద్దగా పట్టించుకోని తారక్, తర్వాత మాత్రం గ్యాప్ లేకుండా చూసుకునే ప్రయత్నాలు చేస్తున్నాడట. ప్రస్తుతం కథలు కూడా వినకుండా ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఉన్న తారక్,

ఈ సినిమా షూటింగ్ అయిన వెంటనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్దంగా ఉన్నాడట. ఇది తెలుసుకున్న తమిళ దర్శకుడు ఒకరు ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారట. తారక్ కి క్రమంగా తమిళంలో క్రేజ్ పెరుగుతుంది అని భావించిన ఆ దర్శకుడు అతని కోసం ఒక మాస్ పాత్రను తమిళంలో తెలుగులో ఆకట్టుకునే విధంగా సిద్దం చేసినట్టు సమాచార, కథను ఎన్టీఆర్ కి వినిపించి దాని ద్వారా ముందుకి వెళ్ళే ప్రయత్నాలను ఆ దర్శకుడు చేస్తున్నట్టు సమాచార౦.

అరవింద సమేత, జనతా గ్యారేజ్ సినిమాలు తమిళంలో కూడా ఆకట్టుకున్నాయి. దీనితో తారక్ తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడట. అక్కడ కూడా మార్కెట్ ఉంటుందని, నిర్మాత కూడా సిద్దంగా ఉన్నారని ఆ దర్శకుడు తారక్ కి చెప్పినట్టు సమాచార౦. ఇటీవల షూటింగ్ లో గ్యాప్ వచ్చిన సమయంలో ఆ కథను వినిపించారట. దీనికి తారక్ కూడా ఆసక్తి చూపించి సంక్రాంతి తర్వాత తాను ఫ్రీ గా ఉంటాను అని అప్పుడు కథను వింటాను అని చెప్పినట్టు ఫిలిం నగర్ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.

Share.