ప్రభాస్ ఫ్యాన్స్ విసిగిపోయారా…?

Google+ Pinterest LinkedIn Tumblr +

బాహుబలి సినిమాతో ప్రభాస్ ఒక్కసారిగా జాతీయ స్టార్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా వసూళ్లు, సాధించిన విజయం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అటు హాలివుడ్ లో కూడా ఈ సినిమా సత్తా చాటింది. సినిమా రెండు భాగాలు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత ప్రభాస్ సినిమా అనగానే దేశ వ్యాప్తంగా ఒక ఆసక్తి నెలకొంది. బాహుబలి సినిమా కోసం దాదాపు అయిదేళ్ళు తీసుకున్న ప్రభాస్, ఆ తర్వాత రెండేళ్ళు తీసుకుని సాహో సినిమా చేసాడు.

ఇప్పుడు అదే చికాకుగా మారింది అతని అభిమానులకు. వాస్తవానికి మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి హీరోలు ఎప్పటికప్పుడు సినిమాలతో అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. ఏడాదికి ఒక సినిమా అయినా సరే వాళ్ళ నుంచి ప్రేక్షకుల ముందుకి వస్తుంది. కాని ప్రభాస్ మాత్రం రెండేళ్ళు మూడేళ్ళు అంటూ సమయం వృధా చేస్తున్నాడు. అసలు ఇప్పుడు సినిమా చేస్తున్నాడో లేదో కూడా తెలియని పరిస్థితి. సాహో సినిమా మీద అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

ఆ సినిమా వసూళ్లు సాధించింది గాని అట్టర్ ఫ్లాప్ అయింది. దీనితో ప్రభాస్ ఫాన్స్ చిరాకు గా ఉన్నారు. ఒకపక్క ఇతర హీరోలు ఏడాదికి సినిమా విడుదల చేస్తుంటే అసలు ఏళ్ళకు ఏళ్ళు సమయం తీసుకుని ఆ సినిమా విజయం సాధిస్తుందో లేదో తెలియక అభిమానులు చిరాకు పడుతున్నారు. ఇతర హీరోల ముందు హడావుడి చేస్తూ, ఆ సినిమా ఫ్లాప్ కాగానే సోషల్ మీడియాలో కూడా తిట్లు పడుతున్నారు అభిమానులు. దీనితో ప్రభాస్ సినిమా విడుదల అయినప్పుడు విడుదల అయింది, లేకపోతే సైలెంట్ గా ఉందామనే భావనలో ఉన్నారట.

Share.