తెలుగు బుల్లితెర పాపులర్ యాంకర్లలో రష్మీ ఒకరు. గత కొన్నేళ్లుగా ఆమె బుల్లితెరను ఓ ఊపు ఊపేస్తోంది. ఇటు బుల్లితెరతో పాటు అటు వెండితెర మీద కూడా హాట్ హాట్ హీరోయిన్‌గా రాణించేందుకు కొన్ని ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. ఇక బబర్దస్త్ ప్రోగ్రామ్ ఆమెను ఎంతలా పాపులర్ చేసిందో తెలిసిందే. జబర్ధస్త్ రష్మీ అంటే కుర్రకారులో ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలుసు.
రష్మీ ఇప్పుడు పెళ్లి సందడిలో ఉంది. కొంతకాలంగా సుధీర్-రష్మీ లవ్ చేసుకుంటున్నారు… పెళ్లి కూడా చేసుకుంటున్నారు అన్న వార్తలు కోకొల్లుగా వచ్చాయి. అయితే వీటిని వాళ్లిద్దరు ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు. తాము ప్రేమికులం కాదని.. మంచి లవర్స్ మాత్రమే అని ఎన్నోసార్లు చెప్పారు. అయినా వీరిద్దరిపై ఈ గాసిప్స్ మాత్రం ఆగడం లేదు.
ఇదిలా ఉంటే తాజాగా రష్మీ పెళ్లికి లైన్‌క్లీయర్ అయ్యింది. ప్రస్తుతం రష్మీ సోదరుడి వివాహాం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఇప్పుడు సోదరుడి పెళ్లి అవుతుండడంతో నెక్ట్స్ ఆమె లైన్లో ఉన్నట్లయ్యింది. ఇక రష్మీ జబర్దస్త్ స్టేజ్ మీద ఉన్నా .. బయట ఉన్నా తాను చేసే హంగామా ? అంతా ఇంతా కాదు.
పైగా వేడుక తన ఇంట్లోనే ఉంటే… ఇక తన హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా ? తన సోదరుడి పెళ్లి వేడుకల్లో రష్మీ బంధువులు, స్నేహితులతో కలిసి నానా రచ్చ రచ్చ చేసేసింది.