తెలుగులో ఆఫర్స్ లేని కియారా అద్వానీ బాలీవుడ్ లో మాత్రం చెలరేగిపోతుంది. తెలుగులో మహేష్‌బాబు భరత్అనే నేను సినిమాలో నటించి ఒక్కసారిగా పాపులర్ అయిన ఈ అమ్మడుకు తర్వాత వచ్చిన రామ్‌చరణ్ వినయవిధేయ రామ డిజాస్టర్ అవ్వడంతో కాస్త బ్రేక్ పడినట్లయ్యింది. అయితే బాలీవుడ్‌లో ఆమె దశ తిరిగిపోయింది. కబీర్ సింగ్ లాంటి బోల్డ్ సినిమాతో తెగ ఫెమస్ అయినా కియారా అద్వానీ ఇప్పుడు బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.
కుర్ర హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు ఆమె డేట్ల కోసం ఎగబడుతున్నారు. అక్కడ అంతటి క్రేజ్ తో కియారా ఉంది. తాజాగా కియారా అద్వానీ తెలుగులో వరుణ్ తేజ్ సరసన ఓ క్రీడా నేపథ్యం ఉన్న సినిమా కోసం సంప్రదించినట్లుగా వార్తలొచ్చాయి. కాస్త భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ రోల్‌లో నటిస్తున్నాడు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలనే సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఈ సినిమా కోసం కియారాను సంప్రదిస్తే ఆమె మాత్రం తన డేట్లు ఖాళీగా ఉన్నాయో లేవో చూసుకుని చెపుతానని చెప్పిందట. కియారా డేట్స్ సర్దుబాటు చేసుకుని వరుణ్ తేజ్ కోసం రావాలంటే ఇంకాస్త టైం పడుతుండడంతో.. వరుణ్ తేజ్ ఇక ఆమె కోసం ఆగలేం.. వేరొక హీరోయిన్‌ను సెట్ చేయమని చిత్ర యూనిట్‌కు ఇప్పటికే చెప్పేశాడట.
ఇక ఇటీవలే గద్దలకొండ గణేష్‌తో హిట్ కొట్టిన వరుణ్ ఇప్పటి వరకు కియారా డేట్లు దొరుకుతాయనే ఆశతో ఉన్నాడట. ఇప్పుడు ఆమె ఆలోచిస్తానని చెప్పడంతో ఇప్పుడు మరో హీరోయిన్‌తో రొమాన్స్‌కు రెడీ అయిపోతున్నాడు.