మూడున్నర పదుల వయసు దాటినా సరే వరుసగా సినిమాలు చేస్తూ యువ హీరోయిన్లకు పోటీ ఇస్తుంది సీనియర్ హీరోయిన్ కాజల్. తన పరిచయాలతో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ… అటు తమిళంలో, ఇటు తెలుగులో కూడా సత్తా చాటుతుంది. ఇటీవల నిర్మాణ రంగంపై కూడా ఈ భామ దృష్టి పెట్టింది అనే ప్రచారం కూడా ఎక్కువగానే జరిగినా… యేవో కారణాల వల్ల ఆ సినిమాను వద్దనుకుని తప్పుకుందని వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు హీరోయిన్ గానే సినిమాలు చెయ్యాలని కాజల్ భావిస్తుంది.
ఇప్పుడు తనకు డిమాండ్ ఉందని, దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఆలోచనలో ఉండి వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అయితే… తన పెళ్లి విషయంలో మాత్రం ఈ భామ ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదనే టాక్ వినపడుతుంది. ఇటీవల ఆమె తల్లి తండ్రులు త్వరగా వివాహం చేసుకోవాలని చెప్పినా సరే అందుకు ఆమె అంగీకరించలేదట.
మరో రెండు మూడేళ్ళు తనకు ఇబ్బందులు లేవని… సినిమాల మీద తన దృష్టి అని స్పష్టంగా చెప్పిందట. పోనీ నీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు చేస్తామని చెప్పినా సరే ఆమె అందుకు అంగీకరించలేదట. ఇప్పుడు ఇదే ఆమె ఫ్యామిలీలో గొడవకు కారణం అయిందనే టాక్ ఎక్కువగా వినపడుతుంది. ఆమె తల్లి… పెళ్లి విషయంలో కాజల్ తో గొడవ పడ్డారని… ఆమె హైదరాబాద్ లో సొంతగా ఫ్లాట్ తీసుకుని ఉన్నారని… కొంత కాలంగా కాజల్ ఇంటికి కూడా వెళ్ళడం లేదని ఫిలిం నగర్ లో టాక్.
మరి ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని… ఆమె మాత్రం పెళ్ళికి ససేమీరా అంటుందని అంటున్నారు. తనకు ఇప్పుడు ఆఫర్లు ఉన్నాయని వాటిని పెళ్లి పేరుతో ఎలా వదులుకోవాలని పట్టుదలగా ఉందట ఈ సీనియర్ హీరోయిన్, మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో చూడాలి.