ఆన్ స్క్రీన్ లో హీరి హీరోయిన్ రొమాన్స్ చేసినట్టుగా ఆఫ్ స్క్రీన్ లో చేస్తానంటే కుదురుతుందా చెప్పండి. అయితే కొందరికి అది కూడా ఓకే అన్నట్టు ఉంటుంది అది వేరే మ్యాటర్ లేండి. ఇక్కడ మన విషయానికి వస్తే తెలుగులో ఓ యువ హీరో తనతో నటించిన ఓ హీరోయిన్ ను కెలకడంతో ఆ హీరో గారికి అక్కడ ఇక్కడ కాదు ఏకంగా ముంబై నుండి బెదిరింపు కాల్స్ వచ్చాయట. సదరు హీరో కొన్నాళ్లుగా సినిమాలు చేస్తున్నాడు.
ఈ ఇయర్ ఓ హిట్టు కొట్టాడు. అయితే మనోడికి ఆల్రెడీ ఇలా తన పక్కన నటించిన హీరోయిన్స్ కెలకడం అలవాటే. అయితే ఆ అలవాటుతోనే తనతో నటించిన ఓ హీరోయిన్ ను కెలికాడట. డైరెక్ట్ గా ఆమెతో తనతో డేట్ కు రావాలని అడిగాడట. అంతే ఆ అమ్మడు ముంబై లో తనకు తెలిసిన సర్కిల్ తో చెప్పడం అక్కడ నుండి అతగాడికి కాల్స్ రావడం అంతా జరిగిందట.
మాములుగానే తన పక్కన నటించిన హీరోయిన్స్ ను కెలకడం అలవాటు ఉన్న ఆ హీరోకి ఒక్కసారిగా ముంబై నుండి కాల్స్ రావడంతో మనోడి మైండ్ బ్లాంక్ అయినట్టు తెలుస్తుంది. ఇంతకుముందు సీనియర్ హీరోయిన్స్ తో నటించిన యువ హీరో ఈ అమ్మడు ఇచ్చిన షాక్ కు దిమ్మతిరిగి పోయిందట. మరి ఇక మీదట అయినా ఇలాంటి వేషాలు వేయకుండా ఉంటాడేమో చూడాలి.