నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘రూలర్’. సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా భూమిక, జయసుధ ప్రధాన పాత్రల్లో ఈ సినిమా వస్తోంది. సీకే ఎంటర్‌టైన్‌మెంట్ క్రియేషన్స్ బ్యానర్ మీద కేఎస్ రవికుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రలలో కనిపించనున్నారు. అన్ని పనులను పూర్తి చేసి సినిమాను డిసెంబర్ 20న వరల్డ్ వైడ్ గా విడుదల చేస్తున్నారు. మరోవైపు ప్రమోషన్లను కూడా భారీగా చేస్తూ దూసుకుపోతోంది.
ఇక ఈ సినిమాలో బాలయ్య లుక్స్ కాస్త ఓవరగానే ఉన్నాయి. ముఖ్యంగాఈ సినిమాలో విగ్గుల విషయానికొస్తే.. బాలయ్య టేస్ట్ కి అభిమానులు కూడా ఇబ్బంది పడుతున్నారు. సొంత జుట్టు ఉన్నవాళ్లు ఒకే హెయిర్ స్టైల్ మెయింటెన్ చేయొచ్చు కానీ, విగ్గులు అవకాశం ఉన్నవాళ్లు వారికి నచ్చినట్టు, ట్రెండ్ కి తగ్గట్టు చెలరేగిపోవచ్చు. కానీ.. బాలయ్య మాత్రం ఈ విషయంలో పూర్తిగా ఫెయిలయ్యారని రూలర్ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన చిత్రం `దర్బార్`. క్రియేటివ్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
ఈ చిత్రంలో డ్రస్సింగ్, హెయిర్ స్టైల్ విషయంలో రజనీ చించేశాడనే చెప్పాలి. మరియు రాత్రి రిలీజైన ట్రైలర్ చూస్తే సూపర్ స్టార్ గ్రేస్ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కానీ.. రూలర్ సినిమా కోసం వెయిట్ తగ్గిన బాలకృష్ణ డ్రస్సింగ్, హెయిర్ స్టైల్ విషయంలో మాత్రం వెనకపడ్డారు. సో.. తనకంటే పదేళ్లు పెద్దవాడైనా రజనీని బాలయ్య ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం చాలా ఉందంటున్నారు కొందరు. కాగా, ఇప్పటికే ఈ సినిమాలో బాలయ్యకు సంబందించిన లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో `కనీసం బాలయ్య అద్దంలో చూసుకోడా` అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.